ఎన్ని వాడినా జుట్టు పొడవు పెరగడం లేదా?

జుట్టు రాలిపోకుండా ఉండటానికి, పొడవుగా పెరగడానికి రకరకాల చిట్కాలను పాటించడం మనలో చాలామందికి ఉన్న అలవాటే. కానీ ఎన్ని వాడినా మనం కోరుకున్న ఫలితం మాత్రం కనిపించదు. కొంతమంది మాత్రం ఏమీ వాడకపోయినా.. చాలా పొడవుగా, ఒత్తుగా ఉంటుంది. ఎందుకిలా జరుగుతుంది. మన జుట్టు పెరగుదలను ఆపేస్తున్న కారణాలేంటి? జుట్టు పెరగాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.

కురుల పెరుగుదలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని విషయాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ప్రధానమైనవి

  • వయసు
  • ఆరోగ్యం
  • జుట్టు తత్వం

సాధారణంగా జుట్టు ఎదగడానికి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వాటి వల్ల రాత్రికి రాత్రే కురులు ఒత్తుగా, పొడవుగా అయిపోతాయనుకుంటే పొరపాటే. ముందు మన హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుంటే.. దానికి అనుగుణంగా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన వస్తుంది.

సాధారణంగా జుట్టు పెరుగుదల మూడు దశల్లో ఉంటుంది.

అనాజెన్ : ఈ దశ దాదాపు 2-8 ఏళ్లు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక పెరుగుతుంది.

కాటజెన్ : ఈ దశ 4-6 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక పెరుగుదల ఆగిపోతుంది.

టెలోజెన్ : దీన్ని వెంట్రుక రాలిపోయే దశగా పరిగణిస్తారు. 2-3 నెలలు ఉంటుంది.

మన తలపై ఉన్నవాటిలో దాదాపు 90 – 95 శాతం మొదటి దశలో 5 నుంచి 10 శాతం మూడో దశలోనూ ఉంటాయి. అందుకే రోజుకి దాదాపుగా 100 నుంచి 150 వెంట్రుకలు రాలిపోతుంటాయి.

మరి వెంట్రుకలు పెరిగేలా చేయడం ఎలా?

ముందు చెప్పుకున్నట్టుగానే ఒకటి రెండు రోజుల్లో జుట్టు పొడవుగా పెరిగే అవకాశం లేదు. దానికోసం మనం కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి కురుల సంరక్షణ విషయం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పోషకాహారం

తినే ఆహారంలో జుట్టుకి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఆహారంలో ఒమెగా 3, ఒమెగా 6, జింక్, బీ 5, బయోటిన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ డి  కలిగిన ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటే.. మాత్రం డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి.

నూనెలు

ఎస్సెన్సియల్ నూనెలు ఉపయోగించడం ద్వారా జుట్టు ఎదిగేలా చేసుకోవచ్చు. రోజ్ మేరీ, జొజోబా, టీట్రీ, పెప్పర్మింట్ తదితర నూనెలను ఎస్సెన్సియల్ నూనెలు అని పిలుస్తారు. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే వీటిని నేరుగా వెంట్రుకలకు రాసుకోకూడదు. కొన్ని చుక్కలు కొబ్బరినూనెలో కలిపి రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే తలస్నానం చేసేటప్పుడు షాంపూలో కొన్ని చుక్కల జొజోబా నూనె కలిపి అప్లై చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

ప్రొటీన్

కురులపై కాలుష్య ప్రభావం పడకుండా ప్రొటీన్ కాపాడుతుంది. కాబట్టి ప్రొటీన్ నిండిన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే హీట్ స్టైలింగ్ చేసుకునేటప్పుడు అంటే.. స్ట్రెయిటనింగ్, కర్లింగ్ లాంటివి చేసుకునేటప్పుడు ప్రొటీన్ నిండిన హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. తలస్నానానికి ముందు తర్వాత కొంత కొబ్బరినూనె అప్లై చేసుకోవడం ద్వారా వెంట్రుకలు ప్రొటీన్ కోల్పోకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఎక్కువగా తింటే.. వెంట్రుకలు బిరుసుగా మారి తెగిపోయే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రొటీన్ విషయంలో సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా కూరగాయలు, నట్స్, పెరుగు వంటివాటిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ప్రొటీన్ పొందవచ్చు.

జుట్టు ఎదగడాన్ని ప్రభావితం చేసే అంశాలు

  • జన్యుపరమైన కారణాలు
  • కుటుంబంలో ఎవరికైనా జుట్టు రాలే సమస్య ఉండటం
  • హార్మోన్ల ప్రభావం
  • పోషకాహారం తీసుకోకపోవడం
  • అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఔషధాలు
  • ఒత్తిడి

జుట్టు విపరీతంగా రాలుతూ.. దానికి గల కారణాన్ని మీరు గుర్తించలేకపోతున్నట్లయితే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే.. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిపోవడం మన అనారోగ్యానికి సూచన కావచ్చు.

గర్భిణిల్లో ఎందుకు జుట్ట బాగా పెరుగుతుంది?

గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో జుట్టు వేగంగా పెరుగుతుంది. అలాగే.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంతే వేగంగా రాలిపోతుంది. దీనికి కారణం ఏంటంటే.. గర్భధారణ సమయంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకల అనాజెన్ దశ కాలాన్ని పెంచుతుంది. ప్రసవం జరిగిన తర్వాత ఈస్ట్రోజెన్ సాధారణ స్థాయికి రావడం వల్ల అవన్నీ మూడో దశకు చేరుకుని రాలిపోతాయి.

మన జీవన విధానం, వాతావరణంలో వచ్చిన మార్పులు మన జుట్టు పెరుగుదలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి మనం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం సంతులిత ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. జుట్టు రాలడం ఆగకపోతే.. వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

ప్రభాస్ రాధేశ్యామ్ గా వస్తున్నాడు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. సాహో తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ‘రాధేశ్యామ్’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సినిమా టీం ఈ రోజు రిలీజ్ చేసింది. ఆకాశం, భూమి ఉన్నంత కాలం నిలిచి ఉండే గాథ ఈ రాధే శ్యామ్ అని ట్వీట్ చేశారు డైరెక్టర్. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం  తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. బాహుబలి తో రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది. సాహో సినిమా తెలుగు లో నిరాశపరిచినప్పటికీ నార్త్ లో వసూళ్ల వర్షం కురిపించి అందర్నీ ఆశ్చర్యపరచింది. దీంతో రాధేశ్యామ్ పై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగాయి.
సాహో సినిమాకు రెండేళ్లు టైం తీసుకోవడంతో ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని భావించారు. లాక్ డౌన్ కి ముందు ప్రభాస్, పూజ హెగ్డే ల మీద జార్జియా లో కొన్ని కీలక సన్నివేశాలను తీశారు. అయితే కరోనా వల్ల షూటింగ్ లు నిలిచిపోవడంతో మొత్తం ప్రణాళికలు మారిపోయాయి.  ప్ర‌భుత్వం ఇటీవ‌లే సినిమా షూటింగ్స్‌కు ఓకే చెప్ప‌డంతో చిత్ర‌యూనిట్ ఈ నెల రెండో వారం నుంచి రెండో షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించిందుకు సిద్ధ‌మ‌వుతోంది. షూటింగ్ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకపోతే.. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఫస్ట్ లుక్ లో సైతం సినిమా 2021లో విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

టాలీవుడ్ కి మలయాళం కిక్కు..

సినిమా రంగంలో సెంటిమెంట్లు మాములుగా ఉండవు. సినిమా మొదలు నుంచి ముగింపు వరకు ఒక పెద్ద ప్రహసనమే ఉంటుంది. ఒక పెద్ద హిట్టు పడితే.. అదే ఫార్ములాతో వచ్చే సినిమాలు కోకొల్లలు. ఇక ఒక సమయంలో కామెడీ సినిమాలు, ఆ తర్వాత హార్రర్, రీమేక్ లు అంటూ వరుసగా వచ్చి దుమ్ము రేపుతాయి. ప్రేక్షకులు కూడా అదే రీతిలో ఆదరిస్తారు. అదే విధంగా ఇప్పుడు మలయాళం సినిమాల ప్రభావం టాలీవుడ్ పై పడింది.  ఓటీటీ లో రిలీజ్ అయిన సినిమాలకి మంచి టాక్ వస్తే చాలు.. మన నిర్మాతలు హక్కుల కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కొన్ని మలయాళం సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తీయడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఫహద్ ఫాసిల్ హీరో గా చేసిన మలయాళం సినిమా ‘మహేశింతే ప్రతీకారం’ ను ఇప్పటికే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ గా రీమేక్ చేశారు. ఈ నెల 15 న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

మోహన్ లాల్ ‘లూసిఫర్’ ను మెగా స్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ఇప్పటికే తెలుగు లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమా డైరెక్ట్ చేయనున్నాడు. ఇక గత కొంత కాలం గా అందరి నోట్లో వినిపిస్తున్న సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’. 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. రవితేజ , రానా కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు ‘కప్పెల‘ సినిమా హక్కులని సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఇంకో మలయాళం సినిమా ‘హెలెన్’ ను పీవీపీ సంస్థ రీమేక్ చేయనుంది. ఇక విమర్శకుల ప్రశంసలు పొందిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా కోసం సైతం పోటీ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని వచ్చే ఏడాది తెరకెక్కనున్నాయి.  ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, రామ్ రెడ్, వెంకటేష్ నారప్ప సినిమాలు కూడా రీమేక్ అయ్యి వస్తున్నవే. 

ఈ రెండే ఓటీటీ ఆశలు నిలబెట్టాయ్..

కృష్ణ అండ్ హిజ్ లీల‌, భానుమ‌తి & రామ‌కృష్ణ‌.. గత రెండు వారాల్లో ఓటీటీ వేదికలపై విడుదలై మంచి టాక్ సాధించిన చిన్నసినిమాలు.  ఈ రెండు సినిమాలు లవ్ స్టోరీలే కావడం విశేషం. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన కృష్ణ అండ్ హిజ్ లీల.. ముఖ్యంగా యువత ను ఆకట్టుకుంది.  కథ నుంచి టేకింగ్ వరకు అంత ఫ్రెష్ కాన్సెప్ట్ తో ఇప్పటి వాళ్ళకి నచ్చే విధంగా నిర్మించారు. ముందు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా యాప్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది.  సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా, శ్రద్దా శ్రీనాథ్, సీరత్‌ కపూర్‌, షాలినీ వందికట్టి  హీరోయిన్లుగా న‌టించారు. ఇక నవీన్ చంద్ర, సలోనీలుత్రా జంటగా నటించిన ‘భానుమతి అండ్  రామకృష్ణ’. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే తెనాలి అబ్బాయి, విజయవాడ అమ్మాయి మధ్య సాగే లవ్‌స్టోరీ వీక్షకులని మెప్పించిందనే చెప్పాలి. సహజత్వానికి దగ్గరగా ఉండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సినిమా గంటన్నరే అయినప్పటికీ.. ఎమోష‌న్స్‌,  డైలాగ్స్ సినిమాని నిలబెట్టాయి. 

ప్రస్తుతం సినిమా థియేటర్లు లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ దిగ్గజాలు దీన్ని ఒక అవకాశంగా మలుచుకుని దూసుకెళ్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఓటీటీల్లో నేరుగా విడుదల అయిన సినిమాలు నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. తెలుగులో అమృతరామం నుంచి.. అమితాబ్ గులాబో సితాబో, జ్యోతిక పొన్ మగాళ్ వందాల్, కీర్తి సురేష్ పెంగ్విన్ వరకు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పొచ్చు. ఈ సినిమాలంటికి ప్లాప్ నుంచి బీలో యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. ఒక మంచి హిట్టు పడాల్సిన అవసరం వచ్చిన సమయంలో కృష్ణ అండ్ హిజ్ లీల‌, భానుమ‌తి & రామ‌కృష్ణ‌ సినిమాలు ఓటీటీ సంస్థల ఆశలను నిలబెట్టాయి.  ఇక ఈ నెల 15 న సత్య దేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్ వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. హిందీలో సైతం వరుసగా సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అమితాబ్ ఝున్డ్, కాంచన రీమేక్ లక్ష్మి బాంబ్, జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా, మల్టీస్టారర్ చలాంగ్, శకుంతల దేవి, కూలీ నె౦ .1 వంటి పెద్ద సినిమాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలు ఓటీటీల  భవిష్యత్ ని ఏ విధంగా మారుస్తాయా మరి. 

టెన్షన్ మొత్తం నాని, రామ్ లకే

కరోనాతో ప్రజల జీవన విధానమే మారిపోయింది. ఇక టాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. వేసవి పై పెట్టుకున్న ఆశలు మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పట్లో థియేటర్స్ తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. తెరిచినా జనాలు వస్తారన్న నమ్మకం లేదు. ఇక సినిమా షూటింగ్ లను మొదలుపెట్టడానికి హీరోలు, నిర్మాతలు ఏ మాత్రం సిద్ధంగా లేరనే చెప్పాలి. ఇంకా రిలీజ్ దగ్గర ఆగిపోయిన సినిమాలది మరో సమస్య. ఓటీటీ రిలీజ్ కి వెళ్లడమా లేదా థియేట్రికల్ రిలీజ్ వరకు ఆగుదామా అని తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలను నేరుగా రిలీజ్ చేసి ఓటీటీ వేదికలు చేతులు కాల్చుకున్నాయి. దీంతో భారీ మొత్తం చెల్లించి హక్కులు దక్కించుకోవడానికి తొందర పడటం లేదు. 

టాలీవుడ్ లో చూస్తే.. నాని ‘వి’ , రామ్ రెడ్, రానా అరణ్య, అనుష్క నిశ్శబ్దం, వైష్ణవ తేజ్ ఉప్పెన వంటి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అరణ్య సినిమా పలు భాషల్లో రిలీజ్ కావాల్సి ఉండగా.. నాని, రామ్ సినిమాలు పూర్తి తెలుగు చిత్రాలు. అయితే వీ, రెడ్ సినిమాలను రిలీజ్ చేయడానికి ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చిన నిర్మాతలు ఒప్పుకోలేదు. ఒక సమయం లో వి సినిమాకు రూ.30 కోట్లు, రామ్ రెడ్ సినిమాకు రూ.22 కోట్లు ఇస్తామని ఆఫర్లు వచ్చాయి. అయితే నిర్మాతలు థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు. పరిస్థితులు ఏ మాత్రం మారకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. నాని, రామ్ లకి కూడా ఇది టెన్షన్ పెంచుతోంది.  బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, అమితాబ్ వంటి స్టార్ల సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదల చేసేస్తున్నారు.  అమితాబ్ ఝున్డ్, కాంచన రీమేక్ లక్ష్మి బాంబ్, జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా, మల్టీస్టారర్ చలాంగ్, శకుంతల దేవి, కూలీ నె౦ .1 వంటి పెద్ద సినిమాలు ఇందులో ఉన్నాయి. 

కరోనా ప్రభావం లేనిది ఈయనొక్కడికే..

టాలీవుడ్ లో విలక్షణ దర్శకుడు అనగానే గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు సంచలనాలు, కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచే వర్మ.. ఈ కరోనా సమయంలో కూడా విభిన్నంగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి తీసిన సినిమాల ఫలితాలను వర్మ ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలే లేవు. అది ఎలా ఉన్నా, జనాలు తిట్టుకున్నా సరే  సంబంధం లేనట్లు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెళ్ళిపోతాడు. ప్రస్తుతం కరోనా వల్ల తెలుగు సినిమా మొత్తం ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం ఫుల్ బిజీ అనే చెప్పాలి. ఇప్పటికే ఆన్ లైన్లో పే ఫర్ వ్యూ ప‌ద్ధ‌తి లో ‘క్లైమాక్స్’, ‘నేకెడ్’ పేరుతో అడల్ట్ కంటెంట్ ని వదిలాడు. మొదటిదానికి 100 , రెండోదానికి 200 వసూలు కూడా చేసాడు. క్లైమాక్స్ తో పోలిస్తే నేకెడ్ కి ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఇంకా ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉండగా.. మరో దాన్ని తాజాగా ప్రకటించేశాడు. 

కరోనా వైరస్ అందులో ఒకటి కాగా.. ఇంకొకటి మారుతీ రావు, అమృత కథాంశంతో వస్తున్నమర్డర్. ఇవి దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ తాజాగా మరో సంచలన ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ఎప్పటిలాగే మెగా ఫ్యామిలీ పై సెటైరికల్ సినిమా ‘పవర్ స్టార్’ తీస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా చెప్పాడు. ఈ చిత్రంలో పీకే, ఎంఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, న‌లుగురు పిల్ల‌లున్న‌ర‌ష్య‌న్ లేడీ, ఆర్జీవీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌బోతున్న‌ట్లు ప్రకటించి దుమారం రేపాడు. ఇక పవన్ కళ్యాణ్ త‌ర‌హాలో ఉన్న ఒక న‌టుడి వీడియో పెట్టి పవర్ స్టార్ గా నటిస్తోంది ఇతనే అని చెప్పుకొచ్చాడు. అయితే రాంగోపాల్ వర్మ సంగతి తెల్సిన పవన్ ఫ్యాన్స్ ఈ ఎత్తుగడని పట్టించుకోలేదని చెప్పాలి. ఎక్కడా దీనిపై మాట్లాడుకునే వాళ్లే కనిపించలేదు. అయితే రిలీజ్ టైం కి మళ్లీ ఎదో ఒక కంటెంట్ పెట్టి మనోభావాలు రెచ్చగొట్టడం వర్మకు అలవాటేనని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఇటువంటి గడ్డు సమయంలో కూడా వర్మ బిజీ బిజీ గా ఉంటూ దూసుకెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

బిగ్ బాస్ 4 .. పాత వాటితో పోలికే లేదు

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రియాల్టీ షో బిగ్ బాస్ .. తెలుగు లో మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ షోని తిట్టుకునే వాళ్ళు ఎంత మంది వున్నారో..  టీవీలకు అతుక్కుపోయే వాళ్ళు అంతకు రెట్టింపు మంది వుంటారు. వ్యక్తిగత విషయాలు, గొడవలు, గ్రూపులు, ఒకరికి తెలీకుండా మరొకరి గురించి మాట్లాడుకోవడం.. ఇలాంటి వాటితో ఈ షో కి మంచి క్రేజ్ వచ్చేసింది. హిందీతో పోలిస్తే మన దగ్గర మసాలా తక్కువనే చెప్పాలి.  ఇప్పటికే నాలుగో సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వల్ల కొంచెం ఆలస్యం అయింది. ఈ ఏడాదికి బిగ్ బాస్ ఉండకపోవచ్చు అన్నారు కానీ.. స్టార్ మా ఏర్పాట్లలో బిజీగా ఉందని టాక్ నడుస్తోంది.  ఇక మూడో సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున.. ఈసారి కూడా కొనసాగనున్నాడు. ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఫైనలైజ్ అయ్యారని చెబుతున్నారు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ 70 రోజులు నడిచింది. అయితే తర్వాతి సీజన్లు ఏకంగా వంద రోజులు పైనే జరిగాయి. అయితే కరోనా వల్ల ఈసారి 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండనున్నారు. సీజన్ ని కూడా తక్కువ రోజులకే పరిమితం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బిగ్ బాస్ సీజన్ 4 కోసం అవసరమైన సెట్ ని అన్నపూర్ణ  స్టూడియోస్ లో స్టార్ మా ఇటీవల పూర్తి చేసింది. సోషల్ డిస్టెన్స్ చాలా అవసరం కాబట్టి..  టాస్క్ ల్లో కూడా పూర్తి మార్పులని స్టార్ మా చేసిందని చెబుతున్నారు. ఈ సీజన్ లో గ్రూప్ టాస్క్ లు ఉండకపోయినా ఆశ్చర్యం అవసరం లేదు. బెడ్ రూమ్స్ నుంచి వాష్ రూమ్స్ వరకు అన్నిట్లో మార్పులు చేసారు అని టాక్. ఇక బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. టీవీ 9 లో వచ్చే ఇస్మార్ట్ న్యూస్ నుంచి బిత్తిరి సత్తి తప్పుకోవడంతో.. అయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. హీరో తరుణ్, జాహ్నవి, మంగ్లీ, వర్షిణి, సీరియల్ యాక్టర్ అఖిల్ శర్తాక్, యాంకర్ శివ ఈ సీజన్లో పాల్గొననున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలను స్టార్ మా ప్రకటించనుంది.

ఓటీటీలోకి వస్తున్నాయ్.. పోతున్నాయ్..

కరోనా భయాలతో ప్రస్తుతం ప్రజలు ఇంటి నుంచే వినోదాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఇది వరంగా మారింది. ఓటీటీ దిగ్గజాలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాక్ డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో చందాదారులను  పెంచుకున్నాయి. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ యాప్ ల ద్వారా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని అవకాశంగా మలుచుకోవడానికి సంస్థలు కూడా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కొన్ని సినిమాల హక్కులని కొనుగోలు చేసి రిలీజ్ చేశాయి. అయితే ఇప్పటి వరకు ఓటీటీల్లో నేరుగా విడుదల అయినా సినిమాలు నిరాశనే మిగిల్చాయని చెప్పాలి.

తెలుగులో అమృతరామం నుంచి.. అమితాబ్ గులాబో సితాబో, జ్యోతిక పొన్ మగాళ్ వందాల్, కీర్తి సురేష్ పెంగ్విన్ వరకు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పొచ్చు. ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయితే కచ్చితంగా ప్లాప్ అవుతాయని డిజిటల్ ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమాలంటికి ప్లాప్ నుంచి బిలో యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. 

వీటి కంటే ఓటీటీ సంస్థలు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లకు మంచి రేటింగ్ లతో పాటు ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. 
దీంతో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు హక్కుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది. తెలుగులో వచ్చిన అమృత రామం అలా వచ్చి వెళ్ళిపోయింది. పెంగ్విన్ కూడా బ్యాడ్ టాక్ మూటగట్టుకుంది. ఇక త్వరలో రిలీజ్ కానున్న సత్య దేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, నవీన్ చంద్ర భానుమతి రామకృష్ణ ఎం చేస్తాయో చూడాలి. ఇక హిందీలో సైతం వరుసగా సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అమితాబ్ ఝున్డ్, కాంచన రీమేక్ లక్ష్మి బాంబ్, జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా, మల్టీస్టారర్ చలాంగ్, శకుంతల దేవి, కూలీ నె౦ .1 వంటి పెద్ద సినిమాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలు అయినా ఓటీటీల అదృష్టాన్ని మారుస్తాయేమో చూడాలి. 

వకీల్ సాబ్ ఏం చెప్పడేంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత  ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే వరుస పెట్టి సినిమాలు ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీఖుషీ అయ్యారు. వకీల్ సాబ్ మాత్రమే కాకుండా క్రిష్ డైరెక్షన్ లో ఒకటి, హరీష్ శంకర్ తో ఇంకో సినిమాకు పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యాడు. అయితే వీటిలో వకీల్ సాబ్ మాత్రమే షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ పట్టాలెక్కే  అవకాశం ఉందని అందరు భావించారు. కానీ కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతూ వస్తుండటంతో టాలీవుడ్ టాప్ హీరోలు షూటింగ్ లకు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ కూడా ఇంటికే పరిమితమయ్యాడు. జనసేన వ్యవహారాలను సైతం అక్కడ నుంచే చక్కబెడుతున్నాడు. దీంతో వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి ఎటువంటి వార్తలు వినిపించడం లేదు. రిలీజ్ కూడా వచ్చే ఏడాదికి వెళ్ళింది. 

అయితే తాజా సమాచారం ప్రకారం.. వకీల్ సాబ్ వీలైనంత త్వరగా పూర్తి చేయడం పైనే పవన్ దృష్టి పెట్టాడంట. డైరెక్టర్ వేణు శ్రీరామ్ 30 రోజుల షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తి చెయ్యాలంటే 15 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ కోర్ట్ సెట్టింగ్ లో సీన్ లే తక్కువ యూనిట్ తో షూటింగ్ పూర్తి చేసేయొచ్చు. ఇక వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా మొదలు కావాలి. అయితే ఇది పీరియాడిక్ సినిమా కావడంతో భారీతనం అవసరం. ప్రస్తుత పరిస్థితిల్లో ఇది అసాధ్యం కాబట్టి.. అన్ని కుదురుకున్నాకే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి వకీల్ సాబ్ పూర్తి చేసినా.. తదుపరి సినిమాల్లో పవన్ కళ్యాణ్ తొందరపడటం లేదని స్పష్టమవుతోంది. 

కీర్తి సురేష్ కు సీన్ అర్థమైంది..

మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కీర్తి సురేష్. అప్పటి వరకు అలా అలా సాగిన ఆమె కెరీర్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. జాతీయ ఉత్తమ అవార్డు కూడా వరించడంతో కీర్తి నటనపై ఉన్న విమర్శలు కూడా తొలిగిపోయాయి. అంత గొప్ప సినిమా తర్వాత ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలో మాత్రం తేల్చుకోలేకపోయింది. మహానటిలో సావిత్రి గా మెప్పించడంతో జయలలిత, విజయ నిర్మల వంటి వారి బయోపిక్ ల్లో నటించే అవకాశాలు వచ్చినా కీర్తి ఒప్పుకోలేదు. కమర్షియల్ సినిమాలు, హీరో ఓరియెంటెడ్ సినిమాల్లో అవకాశాలు రాగా హీరోయిన్ చుట్టూ తిరిగే సినిమాలకే ఓటు వేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి సినిమాలు వరుసగా చేసింది. ఇప్పటికే అమెజాన్ లో రిలీజ్ అయిన పెంగ్విన్ నెగెటివ్ టాక్ మూటకట్టుకుంది. ఇక మిగిలిన రెండు సినిమాల మీద కూడా పెద్దగా బజ్ రాలేదనే చెప్పొచ్చు.

ప్రస్తుత పరిస్థితిల్లో సోలో సినిమాల్లో రాణించడం హీరోయిన్లకు అంత సులభం కాదు. ఈ విషయాన్నీ గుర్తించిన కీర్తి సురేష్ మళ్లీ కమర్షియల్ బాట పట్టింది. ఇటీవల ఫ్యాన్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో ముచ్చటించిన ఈ హీరోయిన్.. మహేష్ బాబు సర్కారు వారి పాట లో నటిస్తున్నట్లు ప్రకటించింది. పారితోషికం సైతం 20 నుంచి 30 శాతం తగ్గించుకుంటానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఒక రెండు మూడు నెలల వరకు షూటింగ్ లకు సిద్ధంగా లేనట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నితిన్ సరసన కీర్తి ‘రంగ్ దే’ సినిమా చేస్తోంది. ఇది దాదాపు పూర్తి అయింది. ఇక రజనీకాంత్ తో కలిసి తమిళ్ లో ఒక సినిమా చేయనుంది. ఏదైతేనేం కీర్తి వాస్తవాన్ని గుర్తించి తొందరగా మేల్కొంది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుకుంటున్నాయి.