ఎన్ని వాడినా జుట్టు పొడవు పెరగడం లేదా?

జుట్టు రాలిపోకుండా ఉండటానికి, పొడవుగా పెరగడానికి రకరకాల చిట్కాలను పాటించడం మనలో చాలామందికి ఉన్న అలవాటే. కానీ ఎన్ని వాడినా మనం కోరుకున్న ఫలితం మాత్రం కనిపించదు. కొంతమంది మాత్రం ఏమీ వాడకపోయినా.. చాలా పొడవుగా, ఒత్తుగా ఉంటుంది. ఎందుకిలా జరుగుతుంది. మన జుట్టు పెరగుదలను ఆపేస్తున్న కారణాలేంటి? జుట్టు పెరగాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.

కురుల పెరుగుదలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని విషయాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ప్రధానమైనవి

  • వయసు
  • ఆరోగ్యం
  • జుట్టు తత్వం

సాధారణంగా జుట్టు ఎదగడానికి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వాటి వల్ల రాత్రికి రాత్రే కురులు ఒత్తుగా, పొడవుగా అయిపోతాయనుకుంటే పొరపాటే. ముందు మన హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుంటే.. దానికి అనుగుణంగా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన వస్తుంది.

సాధారణంగా జుట్టు పెరుగుదల మూడు దశల్లో ఉంటుంది.

అనాజెన్ : ఈ దశ దాదాపు 2-8 ఏళ్లు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక పెరుగుతుంది.

కాటజెన్ : ఈ దశ 4-6 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక పెరుగుదల ఆగిపోతుంది.

టెలోజెన్ : దీన్ని వెంట్రుక రాలిపోయే దశగా పరిగణిస్తారు. 2-3 నెలలు ఉంటుంది.

మన తలపై ఉన్నవాటిలో దాదాపు 90 – 95 శాతం మొదటి దశలో 5 నుంచి 10 శాతం మూడో దశలోనూ ఉంటాయి. అందుకే రోజుకి దాదాపుగా 100 నుంచి 150 వెంట్రుకలు రాలిపోతుంటాయి.

మరి వెంట్రుకలు పెరిగేలా చేయడం ఎలా?

ముందు చెప్పుకున్నట్టుగానే ఒకటి రెండు రోజుల్లో జుట్టు పొడవుగా పెరిగే అవకాశం లేదు. దానికోసం మనం కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి కురుల సంరక్షణ విషయం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పోషకాహారం

తినే ఆహారంలో జుట్టుకి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఆహారంలో ఒమెగా 3, ఒమెగా 6, జింక్, బీ 5, బయోటిన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ డి  కలిగిన ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటే.. మాత్రం డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి.

నూనెలు

ఎస్సెన్సియల్ నూనెలు ఉపయోగించడం ద్వారా జుట్టు ఎదిగేలా చేసుకోవచ్చు. రోజ్ మేరీ, జొజోబా, టీట్రీ, పెప్పర్మింట్ తదితర నూనెలను ఎస్సెన్సియల్ నూనెలు అని పిలుస్తారు. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే వీటిని నేరుగా వెంట్రుకలకు రాసుకోకూడదు. కొన్ని చుక్కలు కొబ్బరినూనెలో కలిపి రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే తలస్నానం చేసేటప్పుడు షాంపూలో కొన్ని చుక్కల జొజోబా నూనె కలిపి అప్లై చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

ప్రొటీన్

కురులపై కాలుష్య ప్రభావం పడకుండా ప్రొటీన్ కాపాడుతుంది. కాబట్టి ప్రొటీన్ నిండిన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే హీట్ స్టైలింగ్ చేసుకునేటప్పుడు అంటే.. స్ట్రెయిటనింగ్, కర్లింగ్ లాంటివి చేసుకునేటప్పుడు ప్రొటీన్ నిండిన హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. తలస్నానానికి ముందు తర్వాత కొంత కొబ్బరినూనె అప్లై చేసుకోవడం ద్వారా వెంట్రుకలు ప్రొటీన్ కోల్పోకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఎక్కువగా తింటే.. వెంట్రుకలు బిరుసుగా మారి తెగిపోయే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రొటీన్ విషయంలో సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా కూరగాయలు, నట్స్, పెరుగు వంటివాటిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ప్రొటీన్ పొందవచ్చు.

జుట్టు ఎదగడాన్ని ప్రభావితం చేసే అంశాలు

  • జన్యుపరమైన కారణాలు
  • కుటుంబంలో ఎవరికైనా జుట్టు రాలే సమస్య ఉండటం
  • హార్మోన్ల ప్రభావం
  • పోషకాహారం తీసుకోకపోవడం
  • అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఔషధాలు
  • ఒత్తిడి

జుట్టు విపరీతంగా రాలుతూ.. దానికి గల కారణాన్ని మీరు గుర్తించలేకపోతున్నట్లయితే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే.. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిపోవడం మన అనారోగ్యానికి సూచన కావచ్చు.

గర్భిణిల్లో ఎందుకు జుట్ట బాగా పెరుగుతుంది?

గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో జుట్టు వేగంగా పెరుగుతుంది. అలాగే.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంతే వేగంగా రాలిపోతుంది. దీనికి కారణం ఏంటంటే.. గర్భధారణ సమయంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకల అనాజెన్ దశ కాలాన్ని పెంచుతుంది. ప్రసవం జరిగిన తర్వాత ఈస్ట్రోజెన్ సాధారణ స్థాయికి రావడం వల్ల అవన్నీ మూడో దశకు చేరుకుని రాలిపోతాయి.

మన జీవన విధానం, వాతావరణంలో వచ్చిన మార్పులు మన జుట్టు పెరుగుదలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి మనం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం సంతులిత ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. జుట్టు రాలడం ఆగకపోతే.. వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

జుట్టు ఎక్కువగా రాలుతోందా? రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి?

జుట్టు రాలడం.. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఎదురవుతున్న సమస్య. దీన్నుంచి బయటపడటానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. హెయిర్ ప్యాక్స్, హెన్నా ప్యాక్స్, ఆయిల్ థెరపీ, షాంపూ, కండిషనర్ అంటూ.. రకరకాల ఉత్పత్తులు ఉపయోగిస్తూ ఉంటారు. అయినా ఫలితం కనిపించలేదని బాధపడిపోయేవారు చాలా మందే ఉంటారు. మీకో విషయం తెలుసా? రోజుకి వంద వరకు వెంట్రుకలు ఊడటం సహజమే. అలా ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి రాకపోతేనే జుట్టు పలచగా తయారవుతుంది. మీ జుట్టు పలచగా తయారయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అప్పుడే కదా కొత్త వెంట్రుకలు మళ్లీ మొలవడానికి అవకాశం ఉంటుంది.

Advertisements

జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు

సాధారణంగా జుట్టు రాలిపోవడానికి హార్మోన్ల అసమౌతల్యం, ఒత్తిడి ప్రభావం, వాతావరణంలో వచ్చే మార్పులు, మనం తీసుకునే ఆహారం ప్రధాన కారణాలవుతాయి. అలాగే ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఉపయోగించే కొన్ని రకాల మందుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోవడానికి అవకాశం ఉంది. పీసీఓఎస్ లేదా పీసీవోడీ సమస్యలున్నవారిలోనూ, గర్భం దాల్చిన, మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లోనూ జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. స్కాల్ఫ్ పై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రుతో బాధపడేవారికి కూడా జుట్టు రాలిపోతుంది.

జుట్టు రాలిపోవడానికి ఎన్నికారణాలున్నాయో చూశారా.. !? మరి ఈ సమస్య నుంచి బయటపడటమెలా? దానికీ కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రాలకుండా చేసే చిట్కాలు

తరచూ తలస్నానం

మీ తలలో డాండ్రఫ్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నా లేదా మీ తలలో చెమట ఎక్కువ పడుతూ ఉన్నా వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఆహారం

జుట్టును ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు నిండిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో ఒమెగా 3, 6, 9 భాగంగా ఉండేలా చూసుకోవాలి. పాలకూర, కోడిగుడ్డు, గింజలు, పప్పు ధాన్యాలు, క్యారెట్ వంటి వాటిని తినాలి.

హాట్ ఆయిల్ మసాజ్

వారంలో కనీసం ఒకట్రెండు సార్లు అయినా తలకు గోరు వెచ్చని నూనె రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంటే జుట్టుకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. దీనికోసం కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె ఉపయోగించవచ్చు. హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి Nature’s Absolutes ఆలివ్ ఆయిల్ ప్రయత్నించండి.

Nature’s Absolutes Olive Oil

Buy it here: Nature’s Absolutes Olive Oil

దువ్వేటప్పుడు జాగ్రత్త

జుట్టు తడిగా ఉన్నప్పుడు చిక్కు తియ్యడం, దువ్వడం లాంటి పనులు చేయొద్దు. ఇలా చేయడం వల్ల జుట్టు సాగిపోయి తెగిపోతుంది. పొడి జుట్టు దువ్వు కోవాల్సి వచ్చినప్పుడు పెద్ద పళ్లున్న చెక్క దువ్వెనతో మొదట దువ్వుకుని ఆ తర్వాతే ప్లాస్టక్ దువ్వెనతో దువ్వుకోవాల్సి ఉంటుంది.

Advertisements

వ్యాయామం తప్పనిసరి

జుట్టు రాలడానికి ఒత్తిడి కూడా ఒక కారణం కాబట్టి.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా.. వ్యాయామం, యోగా చేయడం మంచిది. ఇవి మీలోని ఒత్తిడిని తగ్గిస్తాయి.

తగినంత నీరు

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ తగినంత నీరు తాగడం అవసరం. రోజుకి నాలుగు నుంచి ఎనిమిది గ్లాసులు నీరు తాగడం తప్పనిసరి.

స్టైలింగ్ కు దూరంగా

తరచూ హెయిర్ స్టైలింగ్ టూల్స్ అంటే.. కర్లర్, స్ట్రెయిటనర్, హెయిర్ డ్రయర్ ఉపయోగిస్తే వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా జుట్టు ఎక్కువ రాలిపోతుంది. అందుకే వీటిని ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిది. వీటిని కచ్చితంగా వాడాలనుకుంటే హీట్ ప్రొటెక్టెంట్స్ ఉపయోగించడం మంచిది.

చెమట పట్టకుండా

తల చెమట పట్టడం వల్ల స్కాల్ఫ్ పై చుండ్రు సమస్య రావచ్చు. అలాగే జుట్టు సైతం జిడ్డుగా మారిపోతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు కలబంద, నిమ్మ గుణాలున్న షాంపూను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి డాండ్రఫ్ ను తగ్గించడంతో పాటు.. చెమట ఎక్కువగా పట్టకుండా ఉంటుంది.

Image: Pexels

చలికాలంలో జుట్టు బిరుసుగా మారకుండా ఉండటానికి ఏం చేయాలంటే..

చలి వాతావరణంలో జుట్టుకొచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. వెంట్రుకలు పొడిబారి బిరుసెక్కి తెగిపోతుంటాయి. చివర్లు చిట్లిపోతుంటాయి. వీటికి తోడు చుండ్రు సమస్య. వెరసి కురులు మెరుపు కోల్పోతాయి. దాదాపు శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కునే సమస్యే. ప్రస్తుతం మనం చలికాలం ఆరంభంలోనే ఉన్నాం కాబట్టి.. ఇప్పటి నుంచీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.

రోజూ తలకు నూనె..

చలికాలంలో బయటి వాతావరణం చలిగానే ఉన్నా పొడిగా ఉంటుంది. దీనివల్ల వెంట్రుకల్లోని తేమ మొత్తం పోతుంది. అంటే జుట్టు పొడిగా మారిపోతుంది. స్కాల్ఫ్ కూడా తేమ కోల్పోవడం వల్ల అక్కడి చర్మం పొరలుగా ఊడిపోతుంటుంది. మరికొందరిలో చుండ్రు సమస్య తలెత్తుంది. అందుకే మీ డైలీ హెయిర్ కేర్ రొటీన్లో కొబ్బరి నూనెకు చోటివ్వండి. రోజూ కొద్దిగా తలకు నూనె రాస్తే.. వెంట్రుకల్లోని తేమ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. మీకు చుండ్రు ఉన్నా లేదా మాడుపై చర్మం పొలుసులుగా ఊడుతున్నా.. నూనె తలకు పట్టించి అరగంట ఆగిన తర్వాత తలస్నానం చేయండి. దీనికోసం కొబ్బరి నూనె లేదా ఆముదం వాడితే బాగుంటుంది.

తరచూ తలస్నానం వద్దు

ఈ తలస్నానం చేసే అలవాటు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. మీకున్న ఈ అలవాటు శీతాకాలంలో మీ జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేయెచ్చు. రోజూ తలస్నానం చేయడం వల్ల చర్మం విడుదల చేసే.. వెంట్రుకల్లోని తేమను పట్టి ఉంచే సహజమైన నూనెలు పోతాయి. కాబట్టి రెండ్రోజులకోసారి తలస్నానం చేయడం మంచిది. అయినా.. ఇంకా జుట్టు పొడిగానే ఉన్నట్లయితే.. మూడు, నాలుగు రోజులకొకసారి చేయడం మంచిది. రోజూ తలస్నానం చేయాలని మీరనుకుంటే… ఓ చిట్కాను పాటించండి. మీ జుట్టు జిడ్డుగా లేకపోతే.. షాంపూకి బదులుగా కండిషనర్ తో తలస్నానం చేయండి. జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది.

నో హీట్ స్టైలింగ్

జుట్టు పొడిగా మారడానికి హీట్ స్టైలింగ్ కూడా ఒక కారణం కావచ్చు. హెయిర్ డ్రయర్, స్ట్రెయిటనర్, కర్లర్ లాంటివి ఉపయోగించడం వల్ల మీ జుట్టును మీరే నాశనం చేసుకున్నట్లవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీ జుట్టులోని తేమను క్షణాల్లో పీల్చేస్తాయి. కాబట్టి ఈ శీతాకాలంలో ఇలాంటి స్టైలింగ్ టూల్స్ ఉపయోగించకపోవడమే మంచిది. తప్పని పరిస్థితుల్లో ఉపయోగించాల్సి వస్తే.. హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేసుకుని.. ఆ తర్వాతే స్టైలింగ్ టూల్స్ వాడండి.

జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే బయటకు..

తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరకుండానే ఇంటి నుంచి బయలుదేరడం చాలామందికున్న అలవాటు. అదే ఆరిపోతుందిలే అనే ఉద్దేశమో లేదా ఆలస్యం అవుతుందనే కారణమో.. మరేదైనా కానివ్వండి.. మిగిలిన రోజుల్లో అయితే ఫర్వాలేదు కానీ.. చలికాలంలో మాత్రం జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే బయటకు రావడం మంచిది. ఎందుకంటే.. తడిగా ఉన్న జుట్టు ఎక్కువగా సాగిపోతుంది. ఫలితంగా వెంట్రుకలు తెగిపోతుంటాయి. అందులోనూ చలికాలంలో జుట్టు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది.

వారానికోసారి హెయిర్ మాస్క్

ముఖం అందంగా మెరవడానికి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటామో.. కురుల సౌందర్యం, ఆరోగ్యం కాపాడుకోవడానికి మీ జుట్టుతత్వానికి తగిన హెయిర్ ప్యాక్ లేదా మాస్క్ వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రై హెయిర్ ఉన్నవారు కచ్చితంగా వారానికోసారి హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సిందే. దీనివల్ల స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

సిల్క్ క్యాప్

శీతాకాలంలో చలిని కాపాడుకోవడానికి తలకు ఊలు క్యాప్ పెట్టుకోవడమో.. స్కార్ఫ్ కట్టుకోవడమో చేస్తుంటాం. మీకో విషయం తెలుసా? ఊలు జుట్టు పొడిగా మారడానికి, తెగిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి సిల్స్ స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోండి.

నీరు ఎక్కువ తాగాలి..

నిజం చెప్పుకోవాలంటే.. శీతాకాలంలో చాలా తక్కువ నీరు తాగుతాం. కానీ మీ జుట్టు హెల్తీగా, షైనీగా ఉండాలంటే.. తగినంత నీరు తాగడం ముఖ్యం. అప్పుడే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. చుండ్రు, దురద సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Image: Pexels

తలకట్టుకి తగ్గ హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్.. అబ్బాయిలూ ఇవి మీకోసమే..

జుట్టు ఒత్తుగా, అందంగా ఉండాలని అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ ఉంటుంది. అందుకే ఒకప్పుడు అమ్మాయిల కోసమే మార్కెట్లోకి హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ టూల్స్ వస్తే.. ఇప్పుడు అబ్బాయిల కోసమూ ప్రత్యేకించి కొన్ని ఉత్పత్తులు వస్తున్నాయి. క్రీమ్, జెల్, వ్యాక్స్, పొమేడ్స్,లోషన్స్, క్లేస్, స్ప్రేస్ ఇలా ఎన్నో రకాలున్నాయి. కానీ వాటిలో మీ హెయిర్ కు తగ్గవాటిని ఎంచుకోవడమెలా? ఏది వాడాలో ఎలా తెలుసుకోవడం? అలాగని ప్రతిదాన్ని వాడి మీకు పనికొస్తుందా లేదా అని పరీక్షించుకోవడం మరీ కష్టం. పైగా అలాంటి ప్రయోగాల వల్ల ఉన్న జుట్టు ఊడిపోద్దేమో అని భయం కూడా ఉంటుంది. అలాంటి భయమేమీ అవసరం లేకుండా ఏ తరహా హెయిర్ ప్రొడక్ట్ పనికొస్తుందో ఈ కథనంలో మీరు తెలుసుకుంటారు.

కర్లీ హెయిర్

మీది కర్లీ హెయిరా? మీ అంత లక్కీ ఇంకెవరూ లేరబ్బా.. ఎందుకంటే జుట్టుఒత్తుగా, చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంది. కానీ సరైన జాగ్రత్త తీసుకోకపోతే జుట్టు పొడిబారిపోతుంది. డ్రైగా మారిన ఉంగరాల జుట్టును మేనేజ్ చేయడం కష్టం. కాబట్టి మీ జుట్టు ఎప్పుడూ తేమను కోల్పోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి.. పొమెడ్( Pomade), క్రీమ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి మీ వెంట్రుకలు తేమ కోల్పోకుండా చూస్తాయి. మీ జుట్టుకు మరింత టెక్స్చర్ రావాలనుకుంటే దానికోసం మోస్( mousse) వాడొచ్చు.

థిక్ హెయిర్

ఒత్తైన జుట్టున్నవారు చాలా అదృష్టవంతులు. ఎందుకు? ఇంకా మీ జుట్టు ఊడిపోలేదు కాబట్టి. మీ జుట్టు చూస్తే మాలోంటళ్లకి అసూయలెండి. అయినా హెయిర్ కేర్ విషయంలో మీకుండే ఇబ్బందులు మీకూ ఉంటాయి. హెయిర్ డెన్సిటీ ఎక్కువ ఉండటం వల్ల దాన్ని కంట్రోల్ చేయడం కాస్త కష్టం. పొమెడ్( Pomade) లేదా హెయిర్ స్టైలింగ్ క్లే(Hair Styling Clay) ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి హెయిర్ స్టైలింగ్ ప్రోసెస్ ను ఈజీగా మార్చేస్తాయి.

థిన్ హెయిర్

ఉన్నోడి కష్టాలు ఉన్నోడివి.. లేనోడి కష్టాలు లేనోడివి. చాలామంది అబ్బాయిలకు ఒక వయసు వచ్చిన తర్వాత జుట్టు రాలిపోవడం మొదలై.. కొంతకాలానికి చాలా పలుచగా అయిపోతుంది. దాన్ని ఒత్తుగా కనిపించేలా చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు జెల్, క్రీమ్, మోస్( mousse), లోషన్స్ ఉపయోగించవచ్చు. తక్కువ జుట్టున్నవారు వ్యాక్స్, పొమెడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

లాంగ్ హెయిర్

లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసేవాళ్లు అది అందంగా కనిపించడానికి కాస్త శ్రమపడాల్సి వస్తుంది. రెగ్యులర్ గా ట్రిమ్ చేయడంతో పాటు.. షాంపూ చేసిన ప్రతిసారి కండిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టైలింగ్ విషయానికి వస్తే పొమెడ్స్ ఉపయోగించవచ్చు. అదే మాట్టె ఫినిష్ లుక్ కోసం హెయిర్ స్టైలింగ్ వ్యాక్స్ ఉపయోగించాల్సి ఉంటుంది.

స్ట్రెయిట్ హెయిర్

ఈ తరహా జుట్టున్నవారు అన్ని రకాల స్టైలింగ్ ప్రొడక్ట్స్, స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. వీరికున్న ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే.. జుట్టు ఒత్తుగా ఉన్నా.. అలా లేనట్టే కనిపిస్తుంది. కాబట్టి మీ జుట్టు మరీ ఫ్లాట్ గా కనిపించేలా చేసే ఉత్పత్తులను ఉపయోగించకపోవడమే మంచిది. వీరికి క్రీమ్, వ్యాక్స్, క్లే ప్రొడక్ట్స్ ఉపయోగించాల్సి ఉంటుంది.

జుట్టును పొడవుగా చేసే హోం మేడ్ హెయిర్ మాస్క్ ( Home made hair masks for long hair )

జుట్టు పొడవుగా, లావుగా ఉండాలని రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తాం. ఈ నూనె పనిచేయకపోతే.. ఆ నూనె.. ఆ నూనె పనచేయకపోతే మరో నూనె ఇలా బ్రాండ్స్ మారుస్తూనే ఉంటాం. షాంపూలు, కండిషనర్లు. ఇలా జుట్టు పెరుగుతుందంటే చాలు ఎంత రేటైనా సరే కొనేయడానికి వెనుకాడం. వీటన్నింటికంటే ప్రభావవంతంగా పనిచేసే చిట్కా ఒకటుంది. ఇది బిరుసుగా, నిర్జీవంగా మారిన జుట్టుకు పోషణ అందించి పొడవుగా అయ్యేలా చేస్తుంది.

పొడి జుట్టు (dry hair) ఉన్నవారికి

హెయిర్ మాస్క్ కోసం కావాల్సినవి: పెరుగు- 5 టేబుల్ స్పూన్లు, శెనగపిండి – 5 టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు

వీటన్నింటినీ గిన్నెలో వేసి బాగా కలిపి తలకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఆపై కండిషనర్ రాసుకోవాలి. శెనగపిండి జుట్టును బలంగా తయారయ్యేలా చేస్తే, పెరుగు, ఆలివ్ నూనె జుట్టును మాయిశ్చరైజ్ చేసి మెరిసేలా చేస్తుంది.

నార్మల్ హెయిర్(Normal Hair) ఉన్నవారికి

హెయిర్ మాస్క్ కోసం కావాల్సినవి: గుడ్డు తెల్లసొన – 1, బాదం గింజల పొడి – 2 టేబుల్ స్పూన్లు, శెనగపిండి – 2 టేబుల్ స్పూన్లు

గుడ్డు సొనలో బాదం గింజల పొడి, శెనగపిండి వేసి బాగా కలపాలి. దీన్ని తలకు అప్లై చేసుకొని 30 నిమిషాల తర్వాత షాంపూ చేసుకొంటే సరిపోతుంది.

ఈ హెయిర్ మాస్క్స్ అప్పుడప్పుడూ వేసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.