టెన్షన్ మొత్తం నాని, రామ్ లకే

కరోనాతో ప్రజల జీవన విధానమే మారిపోయింది. ఇక టాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. వేసవి పై పెట్టుకున్న ఆశలు మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పట్లో థియేటర్స్ తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. తెరిచినా జనాలు వస్తారన్న నమ్మకం లేదు. ఇక సినిమా షూటింగ్ లను మొదలుపెట్టడానికి హీరోలు, నిర్మాతలు ఏ మాత్రం సిద్ధంగా లేరనే చెప్పాలి. ఇంకా రిలీజ్ దగ్గర ఆగిపోయిన సినిమాలది మరో సమస్య. ఓటీటీ రిలీజ్ కి వెళ్లడమా లేదా థియేట్రికల్ రిలీజ్ వరకు ఆగుదామా అని తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలను నేరుగా రిలీజ్ చేసి ఓటీటీ వేదికలు చేతులు కాల్చుకున్నాయి. దీంతో భారీ మొత్తం చెల్లించి హక్కులు దక్కించుకోవడానికి తొందర పడటం లేదు. 

టాలీవుడ్ లో చూస్తే.. నాని ‘వి’ , రామ్ రెడ్, రానా అరణ్య, అనుష్క నిశ్శబ్దం, వైష్ణవ తేజ్ ఉప్పెన వంటి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అరణ్య సినిమా పలు భాషల్లో రిలీజ్ కావాల్సి ఉండగా.. నాని, రామ్ సినిమాలు పూర్తి తెలుగు చిత్రాలు. అయితే వీ, రెడ్ సినిమాలను రిలీజ్ చేయడానికి ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చిన నిర్మాతలు ఒప్పుకోలేదు. ఒక సమయం లో వి సినిమాకు రూ.30 కోట్లు, రామ్ రెడ్ సినిమాకు రూ.22 కోట్లు ఇస్తామని ఆఫర్లు వచ్చాయి. అయితే నిర్మాతలు థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు. పరిస్థితులు ఏ మాత్రం మారకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. నాని, రామ్ లకి కూడా ఇది టెన్షన్ పెంచుతోంది.  బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, అమితాబ్ వంటి స్టార్ల సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదల చేసేస్తున్నారు.  అమితాబ్ ఝున్డ్, కాంచన రీమేక్ లక్ష్మి బాంబ్, జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా, మల్టీస్టారర్ చలాంగ్, శకుంతల దేవి, కూలీ నె౦ .1 వంటి పెద్ద సినిమాలు ఇందులో ఉన్నాయి. 

సూపర్ స్పీడ్ లో నాని..

నేచురల్ స్టార్ నాని దూసుకెళ్తున్నాడు. ఇటీవల వచ్చిన సినిమాలు నానికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. జెర్సీ విమర్శకుల ప్రశంసలు పొందినా కలెక్షన్స్ దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్  లీడర్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో డైలమా లో పడ్డ నాని కొత్త సినిమాలో విషయంలో పెద్దగా తొందరపడలేదు. అయితే కథలో కొత్తదనం ఉంటే నాని అస్సలు వెనక్కి తగ్గడు అనే పేరుంది. అందుకు తగ్గట్టే లాక్ డౌన్ సమయంలో కొత్త కథలు వింటున్న నాని .. వరుసగా సినిమాలను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్  ఓడెల చెప్పిన కథ నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. శర్వానంద్‌తో పడిపడి లేచె మనసు, రానా విరాట పర్వం సినిమాలకు నిర్మాతగా ఉన్న చెరుకూరి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించకుంటే ఈ పాటికి విడుదల అయ్యేది. ఇది కాకుండా మరో మూడు సినిమాలు నాని చేతిలో ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ సినిమా సెట్స్ పై ఉంది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన  ‘నిన్ను కోరి’  మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యాం సింగ రాయ్’, బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాతే శ్రీకాంత్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే నాని స్పీడ్ తెల్సిందే కాబట్టి ఒక ఏడాదిలో ఈ సినిమాలు విడుదల అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

నేచురల్ స్టార్ నాని నెక్ట్స్‌ సినిమా ఏంటి?

చిన్న చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టి.. నేచురల్ స్టార్ గా ఎదిగిన హీరో నాని. దర్శకుడు కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిపోయాడు. ఆ తర్వాత వరుస హిట్లు కొట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ద్వితీయ శ్రేణి హీరోల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. అయితే గత రెండేళ్లుగా నాని టైం కలిసి రాలేదు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక జెర్సీ విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ సరైన కలెక్షన్స్ దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో నాని డైలమాలో పడ్డాడు. నెక్ట్స్‌ సినిమా విషయంలో పెద్దగా తొందర పడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ చెప్పిన కథ నానికి నచ్చిందని సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాని అంగీకరించాడు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్ను కోరి’ మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.

ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ‘వి’ సినిమా చేస్తున్నాడు. నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి యాక్షన్‌ సినిమాలు చేయరు. ఇందుకు భిన్నంగా ఈసారి యాక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నారు. ఈ సినిమాలో సుధీర్‌బాబు పోలీస్‌ ఆఫీసర్‌గా, నాని విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. నివేదా థామస్, అదితీ రావ్‌ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఇది నాని 25వ చిత్రం. వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక ఇదే సమయం లో విశ్వక్ సేన్, రుహాని శర్మ హీరోహీరోయిన్లుగా నాని “హిట్” అనే సినిమాను నిర్మిస్తున్నాడు.

Design a site like this with WordPress.com
Get started